Singareni Collieries Company : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల వరకు ప్రమాద బీమా లభించబోతోంది. ఈ నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రమాద బీమా అందించేందుకు అంగీకరించింది.
ఈ భీమాని వచ్చే నెల ఫిబ్రవరి 1 వ తేదీ నుండి అమలులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగులకు బీమా 40 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం అది కోటి రూపాయల వరకు కి పెరిగింది.