Tips For Healthy Summer : వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండ వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాం ముఖ్యంగా మన శరీరం హైడ్రేటెడ్ గా ఉండదు. దీని కోసం ఈ రోజు మనం కొన్ని చిట్కాలు నేర్చుకుందాం….
నిద్ర : వేసవికాలంలో మనం ఎక్కువగా అలసిపోతుంటాం. బయటికి కొద్ది సమయం వెళ్లినప్పటికీ ఎండ కిరణాలు తాకడం ద్వారా శరీరం అలసట తీసుకొంటుంది. కావున వేసవి కాలంలో కనీసం ఏడు గంటలు పడుకోవడం వలన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
నీళ్ళు తాగడం : మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి వేసవి కాలంలో ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది. అంతేకాకుండా వేసవి కాలంలో కుకుంభర్, నిమ్మకాయ రసం లేదా ఏవైనా పళ్ల రసాలు తీసుకుంటే శరీరానికి చాలా మంచిది.
ఫైబర్ : వేసవికాలంలో ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ అంతే కాకుండా నట్స్ తీసుకోవడం ద్వారా శరీరం ఎంతో హెల్దీగా ఉంటుంది. రోజుకు కనీసం 25 గ్రాముల ఫైబర్ ని తీసుకోవడం ద్వారా వేసవి కాలంలో ఎంతో హెల్తీగా ఉండొచ్చు.
ఆల్కహాల్ : వేసవికాలంలో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా శరీరానికి ఎన్నో సమస్యలు రావొచ్చు. కావున వేసవి కాలం లో ఆల్కహాల్ కి దూరంగా ఉంటె మంచిది