Sai Pallavi : అందాల భామ సాయిపల్లవి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది సాయిపల్లవి. సాయిపల్లవికి ఒక చెల్లి ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా ఎన్నో సార్లు మనతో పంచుకుంది.
తన పేరు పూజ కన్నా. తాను 2021 లో ఒక చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం సరైన విజయం అందుకోలేకపోయింది. ఆ తర్వాత పూజా కన్నా ఎటు వంటి చిత్రాల్లో నటించలేదు. అకస్మాత్తుగా పూజా కన్నా తన ప్రియుడిని పరిచయం చేసి అందరినీ షాక్ కి గురి చేసింది.
తను వినీత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు అంతేకాకుండా త్వరలో అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కామెంట్ చేసింది. ఇప్పటికే సాయిపల్లవికి పెళ్లి అవ్వని విషయం మనందరికీ తెలిసిందే.
అక్కకి పెళ్లి అవ్వకుండా చెల్లి పెళ్లికి రెడీ అయిందంటూ, ఈ పద్ధతి హిందూ సంప్రదాయానికి సరికాదంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి నాగచైతన్య తో కలిసి తాండల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి చెందు మొండేటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.