Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మొదలు కాబోతుంది. కొడంగల్‌లోని కోస్గిలోని ప్రభుత్వ కళాశాల కాస్త ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ గా మారబోతుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని బుర్రా వెంకటేశం ఉత్తర్వులు విడుదల చేశారు.
2024-25 అకాడమిక్ ఇయర్స్ నుండి అక్కడ ఇంజనీరింగ్ కి సంబంధించిన క్లాసులు జరగబోతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అన్ని చర్యలు త్వరగా పూర్తి చేసుకోవాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కాలేజ్‌లో మూడు బ్రాంచీలు ఉండబోతున్నాయి. ఈ కాలేజ్‌లో బీటెక్ సీఎస్ఈ, సీఎస్ఈ ఏఐ అండ్ ఎమ్మెల్ , డేటా సైన్స్ కోర్సులని ఈ కళాశాల విద్యార్థులకు అందించబోతుంది.