radhika apthe :ముంబాయ్ లో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం రోజున ఒక సంఘటన చోటు చేసుకుంది. భువనేశ్వర్ వెళ్తున్న ఫ్లైట్ ఏరో బ్రిడ్జిపై గంటల వరకు ఇరుక్కుపోయింది. విమానం కోసం వేచి చూసిన ప్రయాణికులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికులకు వెంటిలేషన్ సరిగ్గా అందక విరుచుకుపడ్డారు.
విషయమేంటంటే ఆ ఏరో బ్రిడ్జిపై నటి రాధిక ఆప్తే కూడా ఉంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ రాధిక ఆప్తే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది. నేను ఈ పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ రోజు ఉదయం 8:30. ఫ్లైట్ ఎక్కాలి. కాకపోతే ఇప్పటికే 10:50 అవుతుంది. అయినప్పటికీ విమానం మాత్రం రాలేదు. 12 గంటల వరకు మేము ఇక్కడ వేచి ఉండాల్సివచ్చింది. కనీసం మాకు తాగడానికి నీరు కూడా లేదు. అంటూ రాధిక ఆప్టే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నెటిజన్స్ అందరికి తెలియజేసింది. ఇప్పటివరకి ఈ ఘటనపై ఇండిగో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
View this post on Instagram