Priyanka : మాస్మహారాజ్ రవితేజ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను నటించిన ఈగల్ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్ సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఇది పక్కన పెడితే నటి ప్రియమణి గురించి మనకి తెలిసిందే.
అటు టాలీవుడ్లో సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్లు చేస్తూ బాలీవుడ్ లో కూడా నటించింది ఈ భామ. ఇటీవల తాను నటించిన భామాకలాపం 2 చిత్రం ఆహాలో విడుదలైంది. భామా కలాపం చిత్రానికి చిత్రం సీక్వెల్. మొదటి చిత్రం మంచి విజయం సాధించడంతో సీక్వెల్ ని కూడా ఈమధ్య విడుదల చేశారు.
దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ లో మాట్లాడుకున్నప్పుడు ప్రియమణి, రవితేజ మరియు పలు సినిమా వాళ్ళు ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు….. ప్రియమణి రవితేజని ఒక ప్రశ్న అడిగింది. ప్రస్తుతం మనందరం సినిమాల్లో బిజీగా ఉన్నాం కదా మనిద్దరం ఎప్పుడు కొలాబరేట్ అయ్యేది అంటూ సరదాగా నవ్వుకుంటూ అడిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.