Ooru Peru Bhairavakona Movie Review : ఊరు పేరు భైరవకోన చిత్రం ఫుల్ మూవీ  రివ్యూ

Written by HONEY

Published on:

Ooru Peru Bhairavakona Movie Review : తెలుగు ఇండస్ట్రీలో సందీప్ కిషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటన బాగా  ఉన్నప్పటికీ సరైన కథలు రాలేకపోవడంతో మంచి హిట్లను సంపాదించలేకపోతున్నాడు. ఇటీవలే తాను నటించిన ఊరు పేరు భైరవకోన చిత్రం విడుదలైంది. మరి ఈ చిత్రమైనా విజయం సాధించిందో లేదో తెలుసుకుందాం.

 కథ  :  ముందుగా ఈ చిత్రానికి సంబంధించిన కథకి వస్తే సందీప్ కిషన్ బసవ పాత్రలో నటిస్తున్నాడు. తన ఫ్రెండ్ జాన్ (వైవా హర్షా) ఇద్దరు కలిసి ఒక దొంగతనానికి పాల్పడతారు. తర్వాత. భైరవకోన అనే గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామానికి వెళ్లిన తర్వాత వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిపోతుందనేది ఈ చిత్రం యొక్క కథాంశం. ఈ భైరవ కోన ఊరిలో ఎన్నో భయంకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి గరుడ పురాణంలో మిస్ అయిన నాలుగు పేజీల కి బైరవకోన కథకి ఉన్న సంబంధమే ఈ చిత్రం.

విశ్లేషణ :  ఈ చిత్రానికి సంబంధించిన విశ్లేషణ విషయానికొస్తే….  చిత్రంలో ట్విస్ట్ మంచిగా ఉన్నప్పటికీ డైరెక్టర్ దాన్ని ప్రేక్షకులని సరిగ్గా చేర్చలేకపోయాడు. ఇక తీసుకునేదానికంటే ఎక్కువ లిబర్టీ  తీసుకున్నట్లుగా ఉంది. ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఈ చిత్రాన్ని చిత్రీకరించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనింగ్ గా స్టోరీని  ఆకట్టుకునే విధంగా బాగానే సాగినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చిత్రం అంత డల్ అయిందని చెప్పుకోవచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్ :  నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే సందీప్ కిషన్ ఎప్పటిలాగే తన నటనలో సత్తా చాటుకున్నాడు. ఈచిత్రంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ సక్సెస్ అవ్వాల్సిన చిత్రమే అని చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ విషయానికొస్తే తను కూడా చాలా బాగా నటించింది. సందీప్ కిషన్‌కి ఫ్రెండ్ గా నటించిన వైవా హర్ష, వెన్నెల కిషోర్ మంచి కామెడీని ఆడియన్స్ కి తీసుకొచ్చి పెట్టారు.

 ఈ చిత్రానికి  ఇచ్చే రేటింగ్ : 2.5/5

Leave a Comment