Jayalalitha : నా లైఫ్ లో దురదృష్టవశాత్తూ ఎక్కువ ఉంటుందంటున్న నటి జయలలిత

Written by HONEY

Published on:

Jayalalitha : నటి జయలలిత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను ఎన్నో సినిమాలలో ప్రేక్షకులని అలరించింది. ఒక దశలో అయితే తనులేని చిత్రమంటూ లేకపోయేది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ….  అదృష్టం ఎక్కువగా ఉందా దురదృష్టం ఎక్కువగా ఉందా అని అడిగితే దురదృష్టమే ఎక్కువగా ఉందని చెప్పాలి.
నేను అప్పట్లో ఎక్కడికి వెళ్లినా నన్ను హీరోయిన్ కంటెంట్ మేడమ్ అంటూ పిలిచేవారు. ఎవరు కూడా హీరోయిన్‌గా చేసే అవకాశం ఇచ్చేవారు కాదు. ఇలా ఇచ్చినట్టే ఇచ్చి లాస్ట్ కి రిజెక్ట్ చేసేవారు. అయినా ఎలాంటి నిరాశపర్చకుండా వచ్చిన పాత్రలు చేసుకుంటూ పోయాను. నేను ఒక క్లాసికల్ డాన్సర్. ఈ కారణంగా అలాంటి పాత్రలేమైనా వస్తాయా? అంటూ చాలా వేచి చూసేదాన్ని.
 కానీ నాకు అలాంటి ఒక్క అవకాశం కూడా రాలేదు. నన్ను చూసిన వారు కూడా మీరు చాలా అందంగా ఉన్నారు కదా.  వ్యాంప్ పాత్రలకి ఎలా అడుగుతున్నారు అని అంటూ ఉంటారు. కానీ మనమేం చేయగలం ఫ్యామిలీని పోషించడం కోసం ఏదో ఒకటి చేయాలి కదా అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని చూసిన నెటిజన్స్ బాధపడుతూ కామెంట్లు పెడుతున్నారు.

Leave a Comment