Ileana Child : పెళ్లి కాకుండానే బిడ్డతో షాకిచ్చిన నటి ఇలియానా

Written by HONEY

Published on:

Ileana Child : నటి ఇలియానా  గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. నటి ఇలియానా బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అప్పట్లో ఇలియానా బేబీ బంప్ తో షేర్ చేసిన ఫొటోలు చూసి తాను ప్రెగ్నెంట్ అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
 ఇక ఆ వార్తలకి సాక్ష్యంగానే ప్రస్తుతం తాను ఒక బిడ్డను కన్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అంతేకాకుండా తన భర్త ఎవరో కాదని బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు మైఖేల్ డోలన్ అంటూ చెప్పుకొచ్చింది. వీరిద్దరూ ఒకప్పుడు రిలేషన్ షిప్ లో ఉండే వారని, కానీ ఇప్పుడు విడిపోయినట్లుగా ఇలియానా పోస్ట్ ద్వారా తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం తన కొడుకుతోనే పూర్తి సమయం గడుపుతానంటూ చెప్పుకొచ్చింది. తను షేర్ చేసిన పోస్ట్‌లో తనను ఎంతో బాధలో ఉన్నట్లు కనిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Leave a Comment