Chicken Curry In Telugu : చికెన్ కర్రీ తయారీ విధానం ఈ రోజు చూసేద్దాం…..
కావాల్సిన పదార్థాలు :
నూనె
ఉప్పు- తగినంత
కారం రెండు- 2 టీ స్పూన్లు
పసుపు – ఒక టీస్పూన్
చికెన్ మసాలా- రెండు టీ స్పూన్లు
ధనియాల పొడి- రెండు టీ స్పూన్లు
జీలకర్ర పొడి- ఒక టీస్పూన్
అల్లంవెల్లుల్లి- రెండు టీస్పూన్లు
నూనె – తగినంత
పెరుగు- ఒక కప్పు
నిమ్మకాయ- ఒకటి
చికెన్ – 500 గ్రాములు
ఉల్లిపాయలు- రెండు(పెద్ద సైజ్)
తయారీ విధానం :
ముందుగా చికెన్ ని మారినేట్ చేసుకోవడానికి చికెన్ లో కారం రెండు టీస్పూన్ల చికెన్ మసాలా రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడి రెండు టీ స్పూన్లు, జీలకర్ర పొడి ఒక టీస్పూన్, రెండు టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె మరియు పెరుగు వేసుకొని కలుపుకోని 20 నిమిషాలపాటు పక్కకు పెట్టాల్సి ఉంటుంది.
20 నిమిషాలలోపు చికెన్ మారినేట్ అవుతుంది. ఆ తర్వాత కడాయి లోకి నూనె వేసుకుని నూనె కొద్దిగా కాలాక అందులోనే మిర్చి చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కొద్దిగా పసుపు వేసి పసుపు గోళాకా అల్లం వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్‌ని కడాయి లోకి వేసి 40 నిమిషాలపాటులో లో ఫ్లేమ్ లో ఉడికించినట్లయితే రుచికరమైన చికెన్ కర్రీ రెడీ.