Gropu 2 Update : గ్రూప్ కి సంబంధించిన ఒక అధికార ప్రకటన వచ్చింది. అది ఏంటంటే ఇన్ని రోజులు ఎగ్జామ్ వాయిదా పడుతుందన్న వార్తలను అది ఖండించేసింది. అంతేకాకుండా నిర్వహించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరగబోతున్నట్లుగా ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25 వ తేదీన ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసింది.
ఎలాంటి పరిస్థితిలోనైనా ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి న్యూస్ నమ్మొద్దంటూ విద్యార్థులందరూ పరీక్షకి సిద్ధంగా ఉండాలంటూ వెల్లడించింది. ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించాలి అంటూ వెల్లడించింది.
అంతేకాకుండా ఎలక్షన్ దగ్గరవుతున్న క్రమంలో ప్రభుత్వం ఖాళీలని భర్తీ చేయడానికి ముందుకొస్తుంది కావున ఎలెక్షన్ కోడ్ వచ్చేలోపే ఎన్ని వీలైతే అన్ని భర్తీ చేయాలంటూ యోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుస నోటిఫికేషన్లు ఇస్తోంది.