Winter Tips For Health : ఈ శీతాకాలం రాగానే అందరం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే శీతాకాలంలో ఏ వ్యాధి ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కాదు. చాలామంది శీతాకాలంలో జలుబుతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా శ్వాస సంబంధిత వారు అయితే ఇంకా చెప్పక్కరలేదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలతో తరచూ బాధపడుతూ ఉంటాము. కావున వీటిని మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Winter Tips For Health
హెల్తీ ఫుడ్: మంచి ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో బలం వస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో నట్స్, సీడ్స్ పండ్లు , మంచి కూరగాయలు తీసుకోవడం వల్ల ఇవి ఇమ్యునిటీ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది.దీని ద్వారా శీతాకాలంలో వచ్చే చలిని తట్టుకోవడానికి మన శరీరం సిద్ధంగా ఉంటుంది.
ఎక్సర్సైస్ చేయడం ద్వారా సీతాకాలంలో ఎన్నో లాభాలు ఉన్నాయి. రోజూ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఇది మన శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ ని దృడంగా చేస్తుంది. దీనిద్వారా వాతావరణం వల్ల వచ్చే ఫ్లూ మరియు జలుబు లని ఎదుర్కోవచ్చు.
రోజుకి సరిపడా నీళ్లు తాగి బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ద్వారా ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగిస్తుంది. కావున రోజుకి సరిపడా నీళ్లు తాగడం మంచిది.
బట్టలు సీతాకాలంలో చలి ఎక్కువగా ఉండడం వలన మనం ఉలెన్ బట్టలను ధరించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఆ బట్టలు మనని చలినుండి రక్షిస్తాయి.