Roja : వైసీపీ కౌన్సిలర్ మంత్రి రోజా పై ఆరోపణలు

Written by HONEY

Published on:

Roja : రోజాపై వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపణలు చేసింది. అయితే వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి మంత్రి రోజా మున్సిపల్ చైర్మన్ పదవి కోసం కొరకు ₹70,00,000 డిమాండ్ చేశారంటూ చెప్పుకొచ్చింది.  రోజా సోదరుడైన కుమారస్వామికి కూడా  మూడు ఇన్స్టాల్ మెంట్ లో 40,00,000 వరకు ఇచ్చామంటూ చెప్పుకొచ్చింది.


చైర్మన్ పదవి ఇవ్వకుండా ఇచ్చిన డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదంటూ రోజా పై ఆరోపణలు చేసింది. ఆ ఇచ్చిన 40,00,000 కుమారస్వామి రెడ్డి పంపిన సత్య అనే పేరు గల వ్యక్తికి ఇచ్చామంటూ చెప్పుకొచ్చింది. 


ప్రస్తుతం రోజాకి కాంటాక్ట్స్ అయ్యేటందుకు ప్రయత్నించినా తాను స్పందించడం లేదంటూ వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా మా వద్ద డబ్బులు తీసుకొని చైర్మన్ పదవి మాత్రం వేరే వారికి ఇచ్చామని ఇచ్చిందంటూ వ్యాఖ్యలు చేసింది. దీనికి సాక్ష్యాలుగా భువనేశ్వరి సోదరుడు పంపించిన వ్యక్తికి డబ్బులు ఇస్తుండగా తీసిన వీడియోలోని చూపించింది.

Leave a Comment