Benfits Of Cycling : సైక్లింగ్ చేయడం వల్ల మానవ శరీరానికి ఎన్నో లాభాలు ఉంటాయి. చాలా మంది మార్నింగ్ ఎక్సర్సైస్ బదులుగా సైక్లింగ్ చేస్తూ ఉంటారు. సైక్లింగ్ వల్ల మన ఆరోగ్యానికి ఉన్న లాభాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
BENFITS OF CYCLING
అధిక బరువుతో సమస్యతో బాధపడుతున్నవారు సైక్లింగ్ ఎక్సైజ్గా ఎంచుకోవడం మేలు. ఎందుకంటే సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా శరీరానికి మంచి మెటబాలిజం ని అందిస్తుంది.
సైక్లింగ్ చేయడం వలన కండరాలు దృఢంగా మారతాయి. దీని ద్వారా ఎంత వయసొచ్చినా కీళ్ల నొప్పుల సమస్య నుండి బయట పడవచ్చు. కావున ఎముకలు దృఢంగా ఉంచుకోవాలనుకున్న వారు రోజు సైకిల్ చేయడం మంచిది.
సైక్లింగ్ చేయడం ద్వారా మన రోజువారి ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు ఎందరో నిపుణులు చెప్పుకొచ్చారు.ఎవరైనా ఒత్తిడిగా ఫీలైనప్పుడు 10 నిమిషాలు అలా సైక్లింగ్ చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా శరీరంలో ఎండోర్ఫిన్స్ రిలీస్ అయ్యి మన స్ట్రెస్ ఒత్తిడిని తగ్గిస్తుంది.
సైకిలింగ్ తో వచ్చే లాభాలలో ఇది ముఖ్యమైనది. సైక్లింగ్ చేయడం ద్వారా హార్ట్ అటాక్, హై బీపీ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా సైక్లింగ్ చేయడం ద్వారా టైప్ 2 డయాబెటీస్ నుండి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు.