Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం లో రామ విగ్రహం గురించి క్లారిటీ వచ్చేసింది. మైసూరులో ప్రముఖ శిల్పి అయిన అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజున మీడియా ప్రెస్ మీట్ అరెంజ్ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో చంపత్ రాయ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
ప్రతిష్ఠాపన కొరకు ముగ్గురు శిల్పులు, మూడు విగ్రహాలను సిద్ధం చేసినట్లుగా అరుణ్ యోగిరాజ్ చెప్పుకొచ్చారు. రామ విగ్రహం 150 నుండి 200 కిలోలలోపు ఉంటుందంటూ వెల్లడించారు. అంతే కాకుండా పక్కనే లక్ష్మణుడు చేతులు కట్టుకొని నిలబడిన విగ్రహం. రాముడి పాదాలవద్ద హనుమాన్ భక్తితో నమస్కరిస్తున్నట్లుగా విగ్రహాలు ఉంటాయి అంటూ వెల్లడించారు.
దీనికి సంబంధించిన పూజలు జనవరి 17 నుండి 22 వరకు. జరగబోతున్నట్లుగా మీడియావర్గాలకు తెలియజేశారు. పూజా వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 17 న. రామ్ లల్లా విగ్రహం ర్యాలీగా అయోధ్యకు చేరుకుంటుంది. జనవరి 18 న ప్రాణప్రతిష్ట కి కావాల్సిన పూజలు జరిపిస్తారు. జనవరి 19 న నవగ్రహ పూజ జరిపిస్తారు. జనవరి 20 న వాస్తు శాంతి జరిపించిన తర్వాత సరయూ నది నీటితో ఆలయాన్ని శుభ్రం చేస్తారు. జనవరి 21 న రాముడి విగ్రహానికి జలాభిషేకం చేస్తారు. జనవరి 22 న మధ్యాహ్నం 12:30 నిమిషాలకి విగ్రహ విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది.