Aadhar Scam : మీరు ఆధార్ మిస్ యూస్ చేశారంటూ మీ పేరు మీద వేరే దేశానికి డ్రగ్స్ వెళ్తున్నాయంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అంతేకాకుండా వారు ఒక లింక్ ని పంపించి ఈ లింక్ ద్వారా మీ ఆధార్ మిస్ యూస్ అయ్యిందని పోలీసు కంప్లైంట్ చేయాలని ఫోర్స్ చేయడం మొదలు పెడుతున్నారు.
ఇలాంటి సంఘటనే ఒక చెన్నై మహిళ విషయంలో చోటుచేసుకుంది. తనకు కాల్ వచ్చి మీ ఆధార్ నంబర్‌తో థాయ్ ల్యాండ్ కి డ్రగ్స్ పార్సల్ పంపిస్తున్నారు. మీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలని లింక్ పంపించాడు అంట. అంతే కాకుండా లింగ్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ వెళ్లిపోతుందని నేను మీకు సహాయం చేస్తానని సహాయం పేరుతో మోసం చేయాలని చూశాడట.
కానీ ఇలాంటి ఒక సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ వార్త ఆల్రెడీ తెలిసిన అమ్మాయి మాత్రం జాగ్రత్తపడింది. అంతేకాకుండా తాను పంపించిన లింక్స్ బ్యాంక్ యొక్క లింక్స్ లాగే ఉన్నాయంట. ఏమాత్రం జాగ్రత్త వహించకపోయినా వారి చేతుల్లో మోసపోవడం ఖాయం అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అందర్నీ అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఆ పోస్ట్ మీరు కూడా చూసేయండి
Anyway, I told the scammer I’d wait for the police to contact me and cut the call. Here are some more ways you can protect yourself: https://t.co/UVkkiV3Gkg
— Lavanya Mohan (@lavsmohan) March 5, 2024