A Man Kills His Wife : భార్య ని  ఉరేసే దారుణంగా చంపిన భర్త 

Written by HONEY

Published on:

A Man Kills His Wife : తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది.  పడాల గ్రామంలో సోమవారం రోజున మద్యం మత్తులో ఉన్న ఒక భర్త భార్యని ఉరేసి చంపాడు. పూర్తి వివరాల్లోకొస్తే జేమ్స్, నాగమణి దంపతులు అక్కడ నివసిస్తూ ఉండేవారు.

పిల్లలు  అడుకునే విషయంలో ఈ దంపతులు గొడవ పడ్డారు. జేమ్స్ గొడవ పడుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు. మత్తులో ఉన్న జేమ్స్ కోపంలో భార్య చెంపపై కొట్టడంతో తాను స్పృహ కోల్పోయింది.

స్పృహ కోల్పోవడం చూసిన జేమ్స్ భార్య చనిపోయిందేమో అనే సందేహంతో ఉరేసి భార్యకి  ఉరివేశాడు. స్థానికులందరూ నాగమణి ఇంటికి వచ్చి తనని బ్రతికించే ప్రయత్నం చేశారు. అప్పటికే హాస్పిటల్ కి తరలించినప్పటికీ నాగమణి చనిపోయింది.

నాగమణి నాలుగు నెలల కడుపుతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని జేమ్స్ ని  కస్టడీలోకి తీసుకున్నారు.   పిల్లలు దిక్కులేనివారయ్యారు.

Leave a Comment