Flax Seed Gel : మీకు అవిసె గింజల గురించి తెలుసా? ఈ అవిశ గింజలు అనేవి మన శరీరానికి ఫైబర్, ప్రోటీన్లు, ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని పుష్కలంగా అందిస్తాయి. కావున ఈ విత్తనాలని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో విధాలుగా వాడవచ్చు.
ముఖ్యంగా మనం జుట్టు ని. అయితే ఈ అవిశ గింజలతో జుట్టు సమస్యలని ఎలా తొలగించాలో మనం ఈ రోజు తెలుసుకుందాం.
1. ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళను తీసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి.
2. నీళ్లు మరుగుతున్న సమయంలో గిన్నెలో అవిసె గింజల్ని వేసి మెల్లిగా గరిటెతో తిప్పుతూ ఉండాలి.
3. తిప్పుతున్న సమయంలో మంట కొద్దిగా తగ్గిస్తూ ఆ తర్వాత అవిశ గింజలు నీళ్ళలో ఉడకడం ద్వారా అది ఒక జెల్ లాంటి కన్సిస్టెన్సీలోకి వస్తుంది.
4. ఇప్పుడు దీన్ని ఒక జార్‌లోకి తీసుకోవాలి. ఈ జార్ లో ని జల్ ని మనం జుట్టుకి అప్లై చేసి 30 నిమిషాల నుండి ఒక గంట వరకే ఉంచి తరువాత హెయిర్ వాష్ చేసుకోవాలి
ఇలా చేసినట్లయితే జుట్టు సిల్కీగా, షైనీగా, స్మూత్ గా ఉంటుంది. అవిసె గింజల జెల్ ని జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టురాలే సమస్యను ఆపడమే కాకుండా జుట్టు పెరుగుదలకు ఇది ప్రోత్సహిస్తుంది.