Lavanya Tripati : మెగా ఫ్యామిలీ కండిషన్స్ గురించి లావణ్య త్రిపాటి వైరల్ కామెంట్

Written by HONEY

Published on:

 Lavanya Tripati : అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను వరుణ్ తేజ్ తో కలిసి రెండు చిత్రాల్లో నటించింది. సడన్ గా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసి ప్రేక్షకులను షాక్‌కు గురయ్యేలా చేశారు.

 గత సంవత్సరంలో వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అసలు విషయానికి వస్తే హీరోయిన్ లావణ్య మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన  ట్రైలర్ కూడా ఇటీవలే విడుదల చేయడం జరిగింది.

 అయితే ఈ ఈవెంట్‌లో పాల్గొన్న లావణ్య ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. నాకు సినిమాలకి వెబ్ సిరీస్ లకు పెద్ద తేడా ఏమీ ఉండదు కానీ కథ నచ్చితే చాలు నటిస్తాను. ఈ వెబ్ సిరీస్ తో పాటు ఇంకా రెండు చిత్రాల్లో నటిస్తున్నానంటూ వెల్లడించి. మెగా ఫ్యామిలీ నుండి నాకు చిత్రాల్లో నటించకుండా ఎలాంటి కండిషన్స్ లేవంటూ. చెప్పుకొచ్చింది.

Leave a Comment