Nara Chandra Babu Naidu : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒక అక్రమమని సుప్రీం కోర్టులో చేసిన క్వాష్ పిటిషన్పై ఈరోజు ఒంటిగంటకు తీర్పు రాబోతుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ గత సంవత్సరం అక్టోబర్లోనే పూర్తయిపోయింది.
సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్ర, హరీష్ సాల్వే నారా చంద్రబాబు తరఫున వాదనలు వినిపించడం జరిగింది. నారాచంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను అరెస్ట్ చేయడం అక్రమమని వాదిస్తున్నారు.
సెక్షన్ 17 ఏ ప్రకారం గవర్నర్ నుండి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండానే సీఐడీ తనని అరెస్ట్ చేసిందంటూ వెల్లడించారు. కావున ఈ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇది పక్కన పెడితే ఈ రోజు ఈ నెల 17,19 వ తేదీల్లో చంద్రబాబుకు సంబంధించిన రెండు ముఖ్య కేసులపై విచారణ జరగబోతోంది.