Naa Sami Ranga Review : నటీనటులు: అక్కినేని నాగార్జున, ఆశిక రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నాజర్ తదితరులు.
ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరధి
సంగీతం: కీరవాణి
రచన: ప్రసన్న కుమార్ బెజవాడ.
దర్శకత్వం: విజయ్ బిన్ని.
ఈ చిత్రం యొక్క కథ :
ఈ చిత్రంలో నాగార్జున పేరు కిట్టయ్య. ఇతడు అనాధగా ఉన్నప్పుడు అల్లరి నరేష్ (అంజి ) దగ్గరికి తీస్తాడు. ఇక వారు ఉండే ఊర్లో పెద్దమనిషి నాజర్ ఈ పాత్రలో వ్యవహరిస్తున్నాడు. నాజర్ మాట అంటే నాగార్జునకి శాసనం. చిన్నప్పటి నుండి కిట్టయ్య అశికను (వరాలు ) ఇష్టపడతాడు. అంతేకాకుండా అశిక కూడా కిట్టయ్య ని ప్రేమిస్తుంది.
కానీ వరాలు వాళ్ల నాన్నకి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేక తాను ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. దీంతో పెళ్లి చేసుకోకుండా వారాలు ఒంటరిగా ఉండిపోతుంది. అంజీ వీళ్లిద్దరిని కలపడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాడు మరియు పెద్దయ్య కుటుంబం కి వైరం ఎలా సాగుతుందనేది ఈ చిత్రం యొక్క కథాంశం
సాంకేతికవర్గం: ఈ చిత్రానికి స్పెషల్ గా ఏమైనా ఉందంటే అది కీరవాణి గారు అందించిన సంగీతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి నుండి ఈ చిత్రంలో రిలీజైన పాటలకి వచ్చిన క్రేజ్ మాములుగా లేదు.
కీరవాణి ఒక గొప్ప సంగీతాన్ని ఈ చిత్రానికి అందించాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ సన్నివేశాలు చిత్రానికి ఊపు తెచ్చాయి. చాయాగ్రహణం వ్యవహరించిన శివేంద్ర బాగా చేశాడని చెప్పుకోవాలి. రొటీన్ స్టోరీ అయినప్పటికీ కొంచం ఎంటర్టెనింగ్ ఈ చిత్రాన్ని చిత్రీకరించారు.