Kangana Ranauth : కంగనా బాయ్‌ఫ్రెండ్ పేరు విడుదల చేసిన కంగనా రనౌత్?

Written by HONEY

Published on:

Kangana Ranauth : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి హిట్‌లు కొట్టి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది కంగనా రనౌత్. ఇటీవల కంగనా ప్రేమలో పడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కంగనా ఒక వ్యక్తి చేయి పట్టుకుని నడవడంతో ఈ రూమర్స్ కాస్త ఇంకా ఎక్కువైపోయాయి.
ఇంతకీ కంగనతో ఉన్న ఆ వ్యక్తి ఎవరా? అంటూ జనాలు ఎంతో ఆత్రుతతో వేచి చూస్తున్నారు. ఇంకా జనాల గురించి తెలిసిందే ఆడ మగా కలిసి కనిపిస్తే చాలు వారు డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు.
కంగనా ఈ వార్తలన్నింటికి స్పందిస్తూ ఇద్దరు కలిసి ఉంటే డేటింగ్ కి వెళ్లారంటూ ఎలా అనుకుంటారంటూ ప్రశ్నించింది. మరియు తాను చేయి పట్టుకుని నడిచింది ఎవరో కూడా రివీల్ చేసేసింది.
దాని కంటే ముందు మా గురించి ఊహించి మీరు వార్తల్లో ఏవేవో రాస్తున్నారు అంటూ నెటిజన్స్ పై విరుచుకుపడింది కంగనా రనౌత్. ఇంతకీ కంగనా తో చేయి పట్టుకుని నడిచిన వ్యక్తి ఎవరో కాదు కంగనా హేర్ స్టైలిస్ట్ అంటూ కంగనా తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చింది. ఇంతటితో కంగనా డేటింగ్ రూమర్స్ కి అయితే ఒక ఫుల్ స్టాప్ పెట్టేసింది.

Leave a Comment