Manjunath Arrest : ఛత్రినాక పోలీస్ అధికారులు జ్యోతిశ్య శక్తులు ఉన్నాయంటూ ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అసలు కథ ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి అనే ఒక అబ్బాయి టీవీ లో సిరిగిరి మంజునాధ అని జ్యోతిష్య శక్తులు ఉన్న అతన్ని కలిసి తన తల్లి ఆరోగ్యం కొరకు 2,00,000 రూపాయలు చెల్లించి నరదోషా పూజ చేయించుకున్నాడు.
మంజునాధ వరంగల్ కి చెందిన వాడు. ఇతడు దుర్గాదేవి జ్యోతిష్యాలయం అనే పేరుతో పూజలు జరిపిస్తూ ఉంటాడు. ఇలా తల్లి ఆరోగ్యాన్ని అడ్డుపెట్టుకొని జ్యోతిష శక్తులు ఉన్నాయంటూ మంజునాథ (కోయ రాజు) 17,00,000 వరికి శ్రీకాంత్ దగ్గర తీసుకున్నాడు.
ఇదంతా మోసమని తెలుసుకున్న శ్రీకాంత్ రెడ్డి పోలీసులకి కంప్లైంట్ చేయగా పోలీసులు మంజునాథని అరెస్ట్ చేసి ₹14,65,000 క్లాష్ మరియు తన క్రెడిట్, డెబిట్ కార్డ్ తీసుకున్నారు. అంతే కాకుండా డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ ప్రకారం మంజునాథ్ ని అరెస్ట్ చేయడం జరిగింది.