Gunturu Karam Movie Review
ఈ చిత్రంలో నటించినవారు
హీరో – మహేశ్‌బాబు
హీరోయిన్ – శ్రీలీల
ముఖ్యపాత్రలు: రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, జయరాం, మీనాక్షి చౌదరి, మురళీశర్మ, జగపతి బాబు.
ఛాయాగ్రహణం- మనోజ్
దర్శకత్వం- త్రివిక్రమ్
నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ
సంగీతం- తమన్
కథ: ఈ కథలో మహేష్ బాబు(వెంకటరమణ) అనే పాత్రలో నటించారు. అతడు తల్లిదండ్రులను చిన్నతనంలో దూరం చేసుకుంటాడు. తండ్రి జైలులో ఉండగా తల్లి మరో పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. దీనితో మహేష్ బాబు తల్లి తండ్రులకి దూరంగా పెరుగుతాడు. మహేష్ బాబు ఈ చిత్రంలో మిర్చి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మహేష్ బాబుకి తన తల్లి రమ్యకృష్ణ నుండి పిలుపు అందుతుంది. కానీ ఆ పిలుపు కేవలం ఆస్తి కోసం అని తెలుస్తోంది. దీంతో తల్లి కి ఆస్తి ఇస్తాడా లేదా వీరి బంధం ఎక్కడి వరకు వెళ్తుందనేది కథ.
విశ్లేషణ: మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు చిత్రం గురించి తెలిసిందే. ఈ చిత్రం పెద్దగా కమర్షియల్ హిట్ అవ్వవన్నప్పటికీ కూడా మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం అలాంటి చిత్రమే ఖలేజా కూడా ఇది డిసాస్టర్ గా మారినా గాని. మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం. వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఆ కాంబినేషన్‌లోనే మళ్లీ ———- తెరకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి పోస్టర్‌లో మహేష్‌బాబు బీడీతో కనిపించడం జరిగింది. అంటే మహేష్ బాబుని చిత్రంలో కొంచెం మాస్‌గా చిత్రీకరించారని చెప్పుకోవచ్చు.
మొత్తానికి చూసుకుంటే ఈ చిత్రం పైసా వసూల్ అని చెప్పుకోవచ్చు. కానీ కథను. ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చిత్రీకరించడంలో ఈ సారి త్రివిక్రమ్ నిరాశపరచడం చెప్పుకోవాలి. అంతే కాకుండా తల్లి కొడుకుల యొక్క. బంధాన్ని సరిగ్గా చూపించలేకపోవడం. సీన్లు కొంచెం ప్రేక్షకులకి బోరింగ్ గా అనిపించాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే….
ఇన్ని రోజులు మహేష్ బాబు ప్రతి చిత్రంలో మనకి క్లాసిక్ పాత్రలో కనిపించారు. ఏ సినిమాలో కూడా ఇంత ఉర మాస్ గా అయితే కనిపించలేదు. ప్రేక్షకులు మహేష్‌బాబు నుండి కూడా అదే కోరుకున్నారు. మహేష్ బాబు ఈ సారి ఈ చిత్రంతో ఒక మాస్ పాత్రలో దిగాడు.
ఇతడు మహేష్ బాబు అయినా ఇంత మాస్ కా ఉంటాడా అనే విధంగా. కనిపించాడు. ఇంకా అయితే ప్రేక్షకులను మెప్పించాడని చెప్పుకోవాలి. మహేష్ తర్వాత. బాగా నటించింది ఎవరైనా ఉన్నారంటే ఆ చిత్రంలో ప్రకాష్ రాజ్ అనే చెప్పుకోవాలి. ఇక తర్వాత రమ్యకృష్ణ ఎక్కువ డైలాగ్ లేకపోయినా తన కళ్లతోనే నటన అంతా చూపించింది.
రావు రమేష్ కి స్క్రీన్ టైమ్ ఎక్కువ లేకపోయినా చివర్లో వచ్చే ఒక సీన్కైనా తన సత్తా ఏంటో చాటుకున్నాడు. ఇంకా నటి శ్రీలీల గురించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో శ్రీలీల చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ చిత్రంలో నటించినా సెకండ్ హీరోయిన్ మీనాక్షికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు.
సాంకేతికవర్గం ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్ ప్రేక్షకులని మెప్పించడంలో నిరాశ పరిచారు. కెమెరా పనితనం బాగా సాగింది. ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్. చాలా బాగున్నాయి.
రేటింగ్: 2.5/5