Nation First Business Later : ఇటీవల భారతదేశానికి మాల్దీవ్స్ కి మధ్య వివాదం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసింది. దీనికి కారణం అక్కడికి సంబంధించిన కొందరు మంత్రులు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పట్ల కొన్ని అసంబద్ధమైన వ్యాఖ్యలను చేయడమే.
దాని తర్వాత భారతదేశం నుండి జరిగిన మాల్దీవ్స్ బుకింగ్ కొన్ని నిలిపివేయబడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈస్ మై ట్రిప్ ఒక ఆసక్తికరమైన ప్రకటన విడుదల చేసింది. అదేంటంటే “Nation First Business Later” అంటూ ఒక ప్రకటన చేసింది.
మన దేశంలో ఉన్న బీచ్‌లకి మేము ఎంతో గర్వ పడుతున్నామంటూ వెల్లడించింది. భారతదేశంలో ఉన్న లక్షదీప్, గోవా, కేరళ ఎన్నో అందమైన బీచ్‌లు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. మాల్దీవ్స్ బుకింగ్ ని ఆపివేయడానికి మన దేశ ప్రధాని పైన చేసిన అసంబంధమైన వ్యాఖ్యలే కారణమంటూ వెల్లడించింది.
ఇక జనవరి 8 నుండి మొదలయ్యే మాల్దీవ్స్ బుకింగ్స్‌నన్నింటినీ నిలిపివేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటీవలే లక్షదీప్ చేరుకొని అక్కడికి సంబంధించిన బీచ్ లోని ఫొటో తీసి సందర్శించాలంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇంతటితో మాల్దీవ్ మంత్రులు ఆగకుండా లక్షదీప్ బీచ్‌ల వద్దకు చేరుకొని ఆవేం బాలేవు అన్నట్టుగా మళ్ళీ హేళన చేయడం కొనసాగారు. భారతీయులందరూ మాల్దీవుల్లో పట్ల ఎంతో విరుచుకుపడుతున్నారు. EASE MY TRIP వారు మాల్దీవ్స్ కి సంబంధించిన బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.