Benfits Of Jaggery : బెల్లం ముక్క  ఈ చలికాలంలో తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Written by HONEY

Updated on:

Benfits Of Jaggery : వేరే కాలాలతో పోల్చుకుంటే చలికాలం లో మనకి ఎన్నో రోగాల బారిన పడుతూ ఉంటాము. దీనికి ముఖ్య కారణం శరీరం లో రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే. చలికాలంలో ఏ వ్యాధి? ఎటువైపు నుంచి వస్తుందో ఊహించకుండా వస్తుంది. కాబట్టి మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడానికి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది.

benfits of jaggery

ఇలా చేసుకోవడానికి మనం రోజువారి ఆహారంలో బెల్లం చేర్చుకోవాలి. బెల్లంలో ఎన్నో రకాల పోషకాలు ఉండటం వలన ఇది మన రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా బెల్లంలో ఉండే వేడి చలికాలంలో వచ్చే జబ్బుల నుండి కాపాడుతుంది.

చాలా మంది వారి  ఆహారం, టీ , పానీయాలలో బెల్లం కలుపుతూ ఉంటారు. ఇలా చేయడం వలన వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే మీకు సందేహం రావచ్చు. అది ఏంటంటే ఈ చలికాలంలో కేవలం బెల్లం మాత్రమే ఎందుకు తీసుకోవాలని. మన శరీరం సీతాకాలంలో వచ్చే చలిని తట్టుకోవాలంటే ఎన్నో పోషకాలు కలిగి ఉండాలి.

అలాంటి పుష్కలమైన పోషకాహారం బెల్లంలోనే దొరుకుతుంది. ఆ లాభాలేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం….

Benfits Of Jaggery In Winter

1.  రోజు ఆహారం చేసిన తర్వాత బెల్లం తినడం వలన మన గట్ క్లీన్ అవుతుంది. దీంతో  మలబద్ధకం లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.

2. బెల్లం  మనకి ఒక నేషనల్ స్వీట్నర్ గా  పనిచేయడంతో ఇది శరీరంలోని చక్కెర స్థాయిలని బ్యాలెన్స్ గా ఉంచుతుంది.

3. బెల్లం కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఒక అమృతం లాంటిదని చెప్పాలి. ఎందుకంటే బెల్లం తీసుకున్న వారికి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉండటం వలన ఇది శీతాకాలంలో ఉండే చలిని తట్టుకోవడానికి శరీరానికి ఎంతో బలం ఇస్తోంది.

4. బెల్లం తినడం వలన మానవ లివర్ చాలా శుభ్రంగా ఉంటుంది. తద్వారా రోగాలు మన దరి చేరవు.

5. ఈ శీతాకాలంలో చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను ఎదుర్కొనే వారు  రోజూ బెల్లం తింటే జలువు, ఆస్తమా లాంటి సమస్యలని తరిమేయొచ్చు.

6. రాత్రి పగలు అని కాకుండా రోజు ఒక బెల్లం ముక్క ఆయన తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా తీసుకోవడం వలన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గిస్తూ బరువు అధిక బరువు సమస్యను కూడా ఎదిరించవచ్చు.

Leave a Comment