MP SANJEEV KUMAR : ఏపీలో వైసీపీ పార్టీ టికెట్ల కేటాయింపు జోరుగా నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల్లో 38 స్థానాలలో ఇన్‌చార్జ్‌లను వైసీపీ పార్టీ ప్రకటించింది. అంతే కాకుండా మరో 29 స్థానాల్లో ఇంచార్జులను నియమించడానికి సిద్ధమైంది. దీనితో ఈ స్థానాలు ఎవరికి వస్తుందని జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
ఏపీ CM అయిన జగన్ మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే కాకుండా ఎంపీ సీట్లకు కూడా కసరత్తు చేయడం జరుగుతుంది. ఎంపీ సీట్లను ఎక్కువగా సాధించేందుకు ఎన్నో వ్యూహాలు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ పార్టీలోని ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారు.
అయితే ఈ లిస్ట్‌లో కర్నూల్ ఎంపీ అయిన డాక్టర్ సంజీవ్ కుమార్ పేరు కూడా చేరింది. MP SANJEEV KUMAR తొలిసారిగా వైసీపీ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సంజీవ్ కుమార్ జయ సూర్య ప్రకాష్ రెడ్డి పై 1,48,000 ఓట్ల మెజారిటీతో ఎంపిక ఎన్నికవడం జరిగింది.
అలాంటి భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ సంజయ్ కుమార్ కి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఈ విషయంపై సంజయ్ కుమార్ ఎంతో నిరాశగా ఉన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాకుండా సంజయ్ కుమార్ కి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా జయరాంను దింపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో MP SANJEEV KUMAR టీడీపీ వైపు చేరాలని అనుకున్నట్లుగా వార్తలు నడుస్తున్నాయి. అంతేకాకుండా సంజయ్ కుమార్ టీడీపీ ముఖ్య అధికారులను కలిసినట్లుగా తెలుస్తుంది.